Thursday, November 12, 2015

DIWALI GREETINGS in Adobe Photoshop

30నిముషాలలో ఫోటోషాప్ లో సోషల్ నెట్వర్కింగ్ సైట్ కోసం గ్రీటింగ్ ని తయారు చేయడం ఎలా ?  

    
హాయ్ .....
ఈ రోజుల్లో పండుగ చిన్నదయినా లేక పెద్దదయినా విష్ చేసుకోవడం అనేది మామూలు విషయం అయ్యింది. కొంతమంది SMS రూపం లో wishes పంపితే , మరికొందరు ఫోన్ చేసి నేరుగా శుభాకాంక్షలు చెబుతారు, మరి నాలాంటి గ్రాఫిక్ డిజైనర్ అయితే ఏం చేస్తారు ..... మంచి గ్రీటింగ్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం  ద్వారా విషెస్ చెబుతారు.

ఈ దీపావళి  కోసం నేను నా సొంత సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్-లోడ్ చేయడం కోసం ఒక గ్రీటింగ్ తయారు చేశాను,  అది చేయడానికి  నాకు పట్టిన సమయం 30నిముషాలు,  వాడిన సాఫ్ట్వేర్ అడోబీ ఫోటోషాప్ cs3.

ఈ గ్రీటింగ్ ని నేను ప్రత్యేకంగా facebook timeline కోసం తయారు చేశాను , facebook timeline లో ఎడమ వైపు  ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది అందువల్ల ఎడమ వైపు కొంత స్థలం దాని కోసం విడిచి పెట్టాను, అలా అని ఆ ప్లేస్ ని ఖాళి గా కూడా ఉంచాలని లేదు ఆ స్థలం లో బ్యాక్ గ్రౌండ్ కలర్ ని మనం ఉంచవచ్చు , ఈ కింద ఉన్న పిక్చర్ ని గనక మీరు చూసినట్లయితే అది మీకు సులువుగా అర్ధం అవుతుంది ... facebook  కాకుండా ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అయితే మొత్తం కాన్వాస్ ఏరియా వాడి డిజైన్ చేయవచ్చు .





ముందుగ మీకు చెప్పే విషయం ఏమిటంటే ఏదయినా డిజైన్ చేసే ముందుగా  మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేదానిపైన రఫ్ స్కెచ్ గనక  వేసుకోవడం అలవాటు చేసుకుంటే డిజైన్ చేయక ముందే సగం పని అయిపోయినట్లే , నేను ముందుగానే కొంత డిజైన్ ని ఊహించి పని మొదలు పెట్టాను, ముందుగా దీపావళికి తగ్గట్టుగా రాత్రి ఎఫెక్ట్ రావడం కోసం నీలం రంగు బేస్ గా తీసుకున్నాను , డిజైన్ లో  ఏమేమి  పెట్టాలి, ఎలా అలంకరించాలి అని నేను ముందు గా అనుకోవడం వల్ల కొన్ని images ని ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్  చేసి ఉంచుకున్నాను. 

కాని ఒక్క మాట .... images డౌన్లోడ్ చేసుకునేటపుడు కాపీరైట్ ఉందొ లేదో చూసి డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం , ఎందుకంటే కొన్ని సార్లు images copyright compliant అయి  ఉంటాయి ... అలాంటి images వాడకపోవడం ఉత్తమం, కొన్ని వెబ్ సైట్స్ ఇమేజ్ లను attribute చేయడం ద్వారా ఉచితం గా వాడుకునే అవకాసం కల్పిస్తాయి , అలాంటి సర్వీసెస్ నుండి images డౌన్లోడ్ చేసుకోవడం అన్నివేళలా ఉత్తమం. 

మీరు  ఈ బ్లాగ్ చేరుకున్నారు అంటే మీరు  ఒక గ్రాఫిక్ డిజైనర్ అయిన అయి ఉండాలి లేక ఫోటోషాప్ ఇంకా బాగా నేర్చుకోవాలి అన్న కుతూహలం ఐన  ఇక్కడికి మిమ్మల్ని తీసుకువచ్చి ఉండాలి ... కింద చెప్పబోయే పాయింట్లు గ్రాఫిక్ డిజైనర్ కి ఐతే త్వరగా అర్ధం అవుతాయి , ఒకవేళ  మీరు ఫోటోషాప్ లెర్నింగ్ స్టేజి లో ఉన్నట్లయితే  నా youtube ఛానల్ తెలుగు ట్యుటోరియల్స్ DTP ద్వార మీ స్కిల్ కి పదును పెట్టుకోగలరు.

ఇక డిజైన్ ప్రాసెస్ లోకి వెళితే
 1. ముందుగా ఫోటోషాప్ లో 8inches  X  3inches కొలతలతో 300pixels/inch తో RGB మోడ్ లో ఒక canvas తీసుకున్నాను, ఆ తరువాత ఒక పక్కన ఇంతకుముందు నేను డౌన్లోడ్ చేసిన దీపం ఇమేజ్ ని పేస్టు చేశాను. ఆ ఇమేజ్ ని erase tool (shortcut - E ) తో కార్నర్లు స్మూత్ గా అయ్యేవరకు కొద్దికొద్దిగా ఎరేస్ చేయాలి , ఇమేజ్ స్మూత్ నెస్ కోసం flow & opacity రెండు కూడా 50 కి సెట్ చేసి స్మూత్ గా ఎరేస్ చేయాలి , మనం తీసుకున్న ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్ తో బ్లెండ్ అయ్యే విధంగా మనం లేయర్ పాలెట్ లో ఉన్న బ్లెండ్ మోడ్స్ మారుస్తూ ఉండాలి , ఏదో ఒక బ్లెండ్ మోడ్ లో మీకు అది బ్యాక్ గ్రౌండ్ తో సమానం గా బ్లెండ్ అయినట్లు కనిపిస్తుంది , ప్రతీసారి కూడా ఒకే బ్లెండ్ మోడ్ లో సెట్ అని లేదు, మనo వాడుతున్న బ్యాక్ గ్రౌండ్ రంగు బట్టి బ్లెండ్ మోడ్ ఆధారపడి ఉంటుంది ...  ఈ ట్యుటోరియల్ లో  నేను ఈ ఇమేజ్ ని ఏ విధం గా బ్లెండ్ చేసానో కింద ఉన్న ఇమేజ్ లో మీరు చూడవచ్చు . 













2. ఆ తరువాత స్పార్క్ బబుల్స్ ని డిజైన్ కి add చేశాను. దీనికోసం మీరు google లో bubbles కోసం సెర్చ్ చేస్తే దొరుకుతాయి , bubbles.png అని సెర్చ్ చేస్తే png ఇమేజ్ కూడా మనకి దొరుకుతుంది, ఆ ఇమేజ్ ని ఈ డిజైన్ లోకి తీసుకువచ్చి పైన మార్చినట్లే బ్లెండ్ మోడ్ మార్చి మనకి కావలసిన ఎఫెక్ట్ వచ్చేవిదంగా మార్చుకోవాలి .













3.  ఆ తరువాత ఒక మంచి కాప్షన్ ని ఈ డిజైన్ కి add చేశాను ,  కాప్షన్ మీరు సొంతం గా రాసినది అవ్వవచ్చు లేక ఇంటర్నెట్ లోనుండి గ్రహించినది ఐన అవ్వవచ్చు , రాసిన వారి వివరాలు తెలిస్తే వారిని మీ  బ్లాగ్ లో attribute చేయడం ద్వార వారి కాప్షన్ ఇక్కడ మీరు రైటర్ కి విలువ ఇచ్చిన వారవుతారు , ఇక డిజైన్ విషయానికి వస్తే మీరు ఇక్కడ గమనించవలింది ఏమిటి అంటే running text కి అలాగే మెయిన్ కాప్షన్ కి మనం తేడా చూపించి తీరాలి, ఎందుకంటే మనం ఏం  చెప్పాలి అనుకుంటున్నామో అది రన్నింగ్ టెక్స్ట్ ద్వారా  చెపుతాం అలాగే ఎందుకు చెపుదాం అనుకుంటున్నామో అది మెయిన్ కాప్షన్ ద్వార చెపుతాం అన్నమాట ... ఇక్కడ నేను మెయిన్ కాప్షన్ ని రెండు రంగులతో చూపించాను .














4. ఇక్కడ మెయిన్ కాప్షన్ మీద concentration పెంచడం మనకి అవసరం ఎందుకంటే చూసే వ్యక్తి ఇంకొంచం ఎక్కువసేపు మన డిజైన్ చూడాలి అంటే దానికి ఒక ప్రత్యేఖత కావాలి, అందుకనే నేను టెక్స్ట్ లోపల 45degrees ఆంగిల్ లో లైన్స్ ని ఉంచాను. దీనికోసం నేను ఫోటోషాప్ లో custom shape tool ని ఉపయోగించాను , అందులో ఉన్న ఒక vector shape ని ఇక్కడ వాడడం జరిగింది , ముందుగా  మనం ఏ టెక్స్ట్ లోకి ఆ లైన్స్ ని పంపాలి అనుకుంటున్నామో మనం గీయబోయే custom shapeని ఆ లేయర్ పైన ఉంచాలి , అంటే మెయిన్ టెక్స్ట్ లేయర్ పైన మన ఉంచబోతున్న custom shape ఉండాలి , ఇప్పుడు LAYER MENU లో ఉన్న GROUP WITH PREVIOUS అనే ఆప్షన్ ద్వారా మనం ఆ టెక్స్ట్ లేయర్ లోకి లైన్స్ ని మాస్క్ చేయడం ద్వారా పంపగలం .













5. ఇప్పుడు మెయిన్ కాప్షన్ కింద ఒక ముగ్గు ని ఉంచి ఆ ముగ్గులో దీపాల వరుసని ఉంచాను , కొన్ని సార్లు మనకి మనం సొంతం గా కొన్ని ఇమేజ్ లను తయారు చేసుకోవాలి , అలా తయారుచేసుకున్నదే ఈ ముగ్గు ఇమేజ్ , దాని పైన ఒక వరుసలో దీపాలని ఒకదాని తరవాత ఒకటి అమర్చాలి , దీపం డూప్లికేట్ చేయాలి అంటే CTRL + J ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా మనం దీపం డూప్లికేట్ చేయవచ్చు , ఇలా ముగ్గు మరియు దీపాలు డిజైన్ కి add చేయడం ద్వార మెయిన్ కాప్షన్ మీద concentration ఇంకా పెరుగుతుంది. 













6. ఇప్పుడు మెయిన్ కాప్షన్ ని ఇంకా ఇంకా highlight చేయడం కోసం కాప్షన్ వెనక ఒక చిన్న light ఎఫెక్ట్ ని పెట్టడం జరిగింది, ఆ లైట్ ఎఫెక్ట్ రావడం కోసం elliptical marquee టూల్ తో ఒక CIRCULAR SHAPE సెలక్షన్ గీసి దానికి బ్యాక్  గ్రౌండ్ కన్నా లైట్ కలర్ ఫిల్ చేసి FILTERS > BLUR >GAUSSIAN BLUR ఇవ్వడం ద్వారా మన డిజైన్ లో కనపడే ఎఫెక్ట్ వచ్చే విధంగా మార్చవచ్చు, అలాగే  రెండువైపులా పైసలే (google as PAISLEY )డిజైన్ ని పెట్టడం జరిగింది.అది కూడా మనం మొదటి స్టెప్ లో చేసినట్లు ఎరేజర్ opacity + flow ని 50% కి సెట్ చేసి కొద్దికొద్దిగా ఎరేస్ చేయడం ద్వారా మనకి కావలసిన రిసల్ట్ పొందవచ్చు.













7. మెయిన్ కాప్షన్ కి ఇరువైపులా ఫ్లొరల్ పాటర్న్ ని కూడా కలిపి చివరగా రెండు కాకర పువ్వోత్తులు ఉంచాను,  ఇక్కడ వాడిన ఏ ఆబ్జెక్ట్ కూడా తన visual balance ని కోల్పోకుండా చూడడం అనేది గ్రాఫిక్ డిజైనర్ బాధ్యత ... వీలైనన్ని తక్కువ ఆబ్జెక్ట్ లతో డిజైన్ ని అందం గా చేయొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. 













8. చివర నా లోగో ని ఎడమ వైపు కార్నర్ లో ఉంచడం ద్వారా నా డిజైన్ ని ఇక ముగించాను , అది కూడా మెయిన్ కాప్షన్ కి దూరంగా , అలా  ఎందుకు చేశాను అంటే లోగో కి ఒక స్వతంత్ర అనేది ముఖ్యం .... పండగ గాని, సందర్భం గాని మారుతూ ఉండొచ్చు కాని మన లోగో అనేది మాత్రం ఎప్పటికి మారనిది,  అందుకోసం దానికి ఒక డిజైన్ లో ఒక స్థలం కేటాయించాను... ఇలా చేయడం ద్వార లోగో తనకి తానుగా highlight అవుతుంది అలాగే మిగతా objects ని dominate చేయదు.














చివరగా ఈ  గ్రీటింగ్ ని JPEG ఫార్మాట్ లో SAVE చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో upload  చేయడమే తరువాయి,
 facebook timeline window అప్డేట్ చేయడానికి మనం ఎడమ వైపు కొంత స్పేస్ వదలాలి అని చెప్పడం జరిగింది , మిగిలిన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అయితే ఫుల్ కాన్వాస్ అంతా  డిజైన్ తో అలంకరించవచ్చు

చివరగా డిజైన్ ప్రాసెస్ అంతా  ఒక animated GIF(GRAPHIC INTERCHANGE FORMAT ) గా ఇవ్వడం జరిగింది,  




ఈ ట్యుటోరియల్ point by point చదివి, చూసి ఈ ట్యుటోరియల్ పైన మీ విలువైన  ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఇంకా మరిన్ని ట్యుటోరియల్స్  కోసం రెగ్యులర్ నా బ్లాగ్ ని visit చేస్తూ నా  సోషల్ నెట్వర్కింగ్ సైట్ లను విసిట్ చేయడం ద్వార నాతో రెగ్యులర్ టచ్ లో ఉండండి


మీ వెంకట సాయి కిరణ్
ఫౌండర్ & కంటెంట్ క్రియేటర్
కలర్ ఫుల్ పాలెట్




7 comments:

  1. Hi kiran, objects teesukomani chepparu kani avi ela teesukovalo, ela use cheyyali cheppaledu.
    Deepam ala ela blend ayyindi. Bubbles ela vachayi.
    Main title lo lines, letters lo matramey ela kanabadutunnai
    Ilantivanni cheppali kadandi.
    Objects teesukuntaru sarey, but tell us about how to use.
    Thanks
    Neeraj

    ReplyDelete
    Replies
    1. Your suggestions are taken into account and the content was updated , thanks for your valuable inputs

      Delete
  2. Good job Sai :) You become a very good trainer. Video tutorial would be more useful. All the best wishes for your blog.

    ReplyDelete
  3. బాగుంది కిరణ్... ఫొటోషాప్ ఇంకా ఈజీగా నేర్చుకునే విధానం, వీడియో ద్వారా మాత్రమే కాక ఇలా రైటప్ లో కూడా ఇస్తే కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఉపయోగం...

    దీపావళి గ్రీటింగ్ లో ఫాంట్ పెంచితే మరింత అందం గా ఉండేది...అలాగే లెప్ట్ సైడ్ చాలా గ్యాప్ వచ్చింది... దానిని నేను తగ్గించి చూసాను... చాలా బాగుంది... క్రియేటివిటీ అంటే మరింత మంచిగా తయారు చేయడం... Keep it up...

    ReplyDelete
    Replies
    1. మీ ఫీడ్ బ్యాక్ కి నా ధన్యవాదాలు రాజ్ కుమార్ గారు...
      మామూలుగా మన సోషల్ నెట్వర్కింగ్ సైట్ లో ముఖ్యంగా facebook లో ఎడమ వైపు మన ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది , అందువల్ల నేను ఎడమ వైపు కొంత ఫ్రీ స్పేస్ వదిలేసాను , మీ ఫీడ్ బ్యాక్ చదివాక నేను ట్యుటోరియల్ లో ఈ పాయింట్ డిస్కస్ చేయలేదు అని అనిపించింది, ఈ పాయింట్ ని కూడా నేను ట్యుటోరియల్ లో అప్డేట్ చేస్తాను....THANKYOU VERYMUCH SIR

      Delete