Sunday, November 15, 2015

How to create a Text blast effect in Adobe Photoshop in 20minutes ?

20 నిముషాలలో అడోబీ ఫోటోషాప్ లో టెక్స్ట్ బ్లాస్ట్ ఎఫెక్ట్ ని తయ్యారు చేయడం ఎలా ?


1. ముందుగా అడోబీ ఫోటోషాప్ లో 1000px  x  500px కొలతలతో RGB మోడ్ లో ఒక ఖాళీ కాన్వాస్ తీసుకున్నాను, ఆ తరువాత కీబోర్డ్ లో D మరియు X ప్రెస్ చేశాను .... ఇలా చేయం వల్ల టూల్ బాక్స్ లో  foreground మరియు background రంగులు డిఫాల్ట్ గా నలుపు మరియు తెలుపు రంగులలోకి మారుతాయి, ఆ తరువాత బ్యాక్ గ్రౌండ్ ని నలుపు రంగుతో నింపాను .. బ్యాక్ గ్రౌండ్ కలర్ నింపడానికి కీబోర్డ్ షార్ కట్ ALT +DEL గాని CTRL + DEL కీ ని గాని  ప్రెస్ చేయడం ద్వారా మనం బ్యాక్ గ్రౌండ్ కలర్ ని ఫిల్ చెయ్యవచ్చు .














2. ఆ తరువాత IMPACT FONT తో BLAST అని టైప్ చేసి దానిని తెలుపు రంగు తో నింపాను, టెక్స్ట్ కి కలర్ ని నింపడానికి పాయింట్ 1 లో మనం అవలంబించిన స్టెప్ ని మళ్లీ  ఫాలో అవ్వాలి. ఫాంట్  విషయానికి వస్తే కేవలం IMPACT FONT మాత్రమే  ఎందుకు  అంటే  ఈ ఫాంట్ కి డెన్సిటీ ఎక్కువ అందువల్ల ఎఫెక్ట్ చాలా స్పష్టం గా కనపడుతుంది , ఇది కాకుండా వేరే font ఏదైనా వాడవచ్చు కాని కొంచం dense font అయితే ఎఫెక్టివ్ గా ఉంటుంది .














3. ఇప్పుడు మనం మన టెక్స్ట్ లేయర్ ని డాక్యుమెంట్ కి సెంటర్ చేసుకోవాలి, సెంటర్ ఎందుకు చేయాలో మీకు ఇంకొక రెండు స్టెప్స్ లో అర్ధం అవుతుంది , సెంటర్ చేయడానికి WINDOW > OPTIONS ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా  చేయడం వల్ల CONTROL PALETTE ACTIVATE అవుతుంది , ఇప్పడు లేయర్ పాలెట్ లో టెక్స్ట్ లేయర్ ని సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో CTRL + A ప్రెస్ చేయాలి , ఇలా చేయడం ద్వారా డాక్యుమెంట్ edge లో మీకు సెలక్షన్ బ్లింక్ అవుతూ కనపడుతుంది , అప్పుడు మీరు CONTROL PALETTE బార్ లో కింద ఇమేజ్ లో చూపించిన విధం గా క్లిక్ చేయాలి , ఇలా క్లిక్ చేయడం వల్ల లేయర్ పాలెట్ లో సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ లేయర్ డాక్యుమెంట్ కి సరిగ్గా సెంటర్ లోకి adjust అవుతుంది. CONTROL PALETTE ఏమిటో కింద ఇమేజ్ లో చూపించడం జరిగింది . 


















4. ఇప్పుడు టెక్స్ట్ లేయర్ ని CTRL + J ప్రెస్ చేయడం ద్వారా డూప్లికేట్ చేసుకోవాలి , ఇప్పుడు మొత్తం మనకి రెండు టెక్స్ట్ లేయర్స్ ఉన్నాయ్ అన్నమాట , ఇప్పుడు మనం FILTER > BLUR > RADIAL BLUR సెలెక్ట్ చేసుకోవాలి ,దానిలో OK క్లిక్ చేయాలి ...టెక్స్ట్ అనేది వెక్టార్ గ్రాఫిక్,  blur ఎఫెక్ట్ vector గ్రాఫిక్ మీద అప్లై కాదు, అందుకనే మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ... This type later must be rasterized before proceeding Its text will no longer be editable. Rasterize the type? అనే టెక్స్ట్ తో .... మనం OK క్లిక్ చేయాలి ... ok క్లిక్ చేయడం ద్వారా టెక్స్ట్ rasterize అవుతుంది , vector మరియు raster కి ఉన్న వ్యత్యాసం మీకు నేను ముందు ముందు వివరం గా చెపుతాను. OK క్లిక్ చేసిన తరువాత కింద ఇమేజ్ లో చూపినట్లు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది అందులో AMOUNT ని 100కి సెట్ చేయాలి , BLUR METHOD ని ZOOM కి సెట్ చేసుకోవాలి , QUALITY ని GOOD గాని BEST గా గాని సెట్ చేసుకోవాలి , ఆ తరువాత OK క్లిక్ చేయాలి














5. OK క్లిక్ చేసిన వెంటనే ఎఫెక్ట్ అప్లై అయ్యి OUTPUT ఈ కింద ఇమేజ్ లో చూపించిన విధం గా ఉంటుంది , ఆ తరువాత CTRL + F  ని ప్రెస్ చేయాలి , అలా ఒక 4 లేక 5 సార్లు చేస్తే ఎఫెక్ట్ తీక్షణత పెరుగుతుంది




























6. ఇప్పుడు ఎఫెక్ట్ అప్లై అయిన లేయర్ ని CTRL + J ని ప్రెస్ చేసి duplicate చేయాలి , ఇలా 2సార్లు చేయాలి , ఇలా చేయడం వల్ల  ఎఫెక్ట్ డెన్సిటీ పెరుగుతుంది, కింద ఇమేజ్ లో చూపినట్లు లేయర్ పాలెట్ లో ఎఫెక్ట్ అప్లై అయిన లేయర్లు  ఇప్పుడు మొత్తం 3.














7. ఆ మూడింటిని  కింద ఇమేజ్ లో చూపినట్లు  లింక్ చేసి CTRL +E  ని ప్రెస్ చేయాలి , ఇలా చేయడం వల్ల మూడు ఇమేజ్ లు కలిసి ఒక ఇమేజ్ గా మారతాయి అంటే 3 లేయర్  లు merge అయ్యి ఒక లేయర్ గా మారతాయి .














8. ఇప్పుడు మనం లేయర్ పాలెట్ లో కనక చూస్తే  BLAST అనే పేరు ఉన్న లేయర్ కింద ఉంది , ఎఫెక్ట్ అప్లై అయిన లేయర్ పైన ఉంది , మనం తరువాతి ప్రాసెస్ కి వెళ్ళే ముందు కింద ఉన్న BLAST అనే టెక్స్ట్ లేయర్ ని పైకి తేవాలి , అది ఎలా తేవాలో కింద ఉన్న ఇమేజ్ చూస్తే మీకు అర్ధం అవ్తుంది , లేయర్ పాలెట్ లో ఉన్న టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకుని పైకి పుష్ చేస్తే కింద ఉన్న లేయర్ పైకి , పైన ఉన్న లేయర్ కిందకు కదులుతాయి .














9. ఇమేజ్ లో చూపిన విదంగా లేయర్ ని కదిపిన తరువాత ఇప్పుడు మనం బ్లాస్ట్ టెక్స్ట్ లేయర్ ని అంటే పైన ఉన్న టెక్స్ట్ లేయర్ ని నలుపు రంగుతో నింపాలి , BLAST ఎఫెక్ట్ అప్లై అయ్యి ఉన్న టెక్స్ట్ లేయర్ ని  CTRL + J  రెండు సార్లు ప్రెస్ చేయడం ద్వారా రెండు  డూప్లికేట్ లేయర్ లు తీసుకోండి , ఇప్పుడు BLAST ఎఫెక్ట్ అప్లై అయ్యి ఉన్న లేయర్ లు మొత్తం మూడు , బ్లాస్ట్ టెక్స్ట్ ఉన్న లేయర్ ఒకటి మొత్తం నాలుగు (default background లేయర్ కాకుండా )

 అన్నిటికన్నా కింద ఉన్న BLAST EFFECT లేయర్ కి ఎరుపు రంగు ని ఫిల్ చేయాలి , ఎరుపు రంగు COLOR  వేల్యూ CMYK పద్దతిలో  MEGENTA 100 & YELLOW  100 గా తీసుకోవాలి అదే WEB  పరిబాష లో అయితే #cc2229 కలర్ ని ఫిల్ చేయాలి

ఇప్పుడు ఎరుపు రంగు నింపిన లేయర్ కి పైన ఉన్న లేయర్ కి ని ఫిల్ ఆరంజ్ రంగు ని FILL చేయాలి , ఆరంజ్  రంగు COLOR వేల్యూ CMYK పద్దతిలో  MEGENTA 60 & YELLOW  100 గా తీసుకోవాలి అదే WEB  పరిబాష లో అయితే #db812e కలర్ ని ఫిల్ చేయాలి.

చివరగా ఆరంజ్ రంగు నింపిన లేయర్ పైన ఉన్న లేయర్ ని లైట్ ఆరంజ్ ని FILL చేయాలి, లైట్ ఆరంజ్  రంగు COLOR వేల్యూ CMYK పద్దతిలో  MEGENTA 25 & YELLOW  100 గా తీసుకోవాలి అదే WEB  పరిబాష లో అయితే #efc031 కలర్ ని ఫిల్ చేయాలి.









10. మీరు ఈ స్టెప్స్ ని మిస్ అవ్వకుండా చేస్తే ఎఫెక్ట్ కింద చూపిన విధంగా వస్తుంది .





















































చివరగా డిజైన్ ప్రాసెస్ అంతా  ఒక animated GIF(GRAPHIC INTERCHANGE FORMAT ) గా ఇవ్వడం జరిగింది.














ఎలా ఉందండీ బ్లాస్ట్ ఎఫెక్ట్ ట్యుటోరియల్ , నచ్చింది కదూ ... ఈ ఎఫెక్ట్ తయారు చేయడానికి నాకు పట్టిన సమయం కేవలం రెండు నిముషాలు , కాని పూర్తి ట్యుటోరియల్ తయారు చేయడానికి  పట్టిన సమయం ఒక గంట, ఇక మీరు చేయవలసిందల్లా ట్యుటోరియల్ point by point చదివి, చూసి ఈ ట్యుటోరియల్ పైన మీ విలువైన  ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఇంకా మరిన్ని ట్యుటోరియల్స్  కోసం రెగ్యులర్ నా బ్లాగ్ ని visit చేస్తూ నా  సోషల్ నెట్వర్కింగ్ సైట్ లను విసిట్ చేయడం ద్వార నాతో రెగ్యులర్ టచ్ లో ఉండండి

మీ వెంకట సాయి కిరణ్
ఫౌండర్ & కంటెంట్ క్రియేటర్
కలర్ ఫుల్ పాలెట్

Thursday, November 12, 2015

DIWALI GREETINGS in Adobe Photoshop

30నిముషాలలో ఫోటోషాప్ లో సోషల్ నెట్వర్కింగ్ సైట్ కోసం గ్రీటింగ్ ని తయారు చేయడం ఎలా ?  

    
హాయ్ .....
ఈ రోజుల్లో పండుగ చిన్నదయినా లేక పెద్దదయినా విష్ చేసుకోవడం అనేది మామూలు విషయం అయ్యింది. కొంతమంది SMS రూపం లో wishes పంపితే , మరికొందరు ఫోన్ చేసి నేరుగా శుభాకాంక్షలు చెబుతారు, మరి నాలాంటి గ్రాఫిక్ డిజైనర్ అయితే ఏం చేస్తారు ..... మంచి గ్రీటింగ్ డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం  ద్వారా విషెస్ చెబుతారు.

ఈ దీపావళి  కోసం నేను నా సొంత సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్-లోడ్ చేయడం కోసం ఒక గ్రీటింగ్ తయారు చేశాను,  అది చేయడానికి  నాకు పట్టిన సమయం 30నిముషాలు,  వాడిన సాఫ్ట్వేర్ అడోబీ ఫోటోషాప్ cs3.

ఈ గ్రీటింగ్ ని నేను ప్రత్యేకంగా facebook timeline కోసం తయారు చేశాను , facebook timeline లో ఎడమ వైపు  ప్రొఫైల్ పిక్చర్ వస్తుంది అందువల్ల ఎడమ వైపు కొంత స్థలం దాని కోసం విడిచి పెట్టాను, అలా అని ఆ ప్లేస్ ని ఖాళి గా కూడా ఉంచాలని లేదు ఆ స్థలం లో బ్యాక్ గ్రౌండ్ కలర్ ని మనం ఉంచవచ్చు , ఈ కింద ఉన్న పిక్చర్ ని గనక మీరు చూసినట్లయితే అది మీకు సులువుగా అర్ధం అవుతుంది ... facebook  కాకుండా ఇతర సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అయితే మొత్తం కాన్వాస్ ఏరియా వాడి డిజైన్ చేయవచ్చు .





ముందుగ మీకు చెప్పే విషయం ఏమిటంటే ఏదయినా డిజైన్ చేసే ముందుగా  మనం ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేదానిపైన రఫ్ స్కెచ్ గనక  వేసుకోవడం అలవాటు చేసుకుంటే డిజైన్ చేయక ముందే సగం పని అయిపోయినట్లే , నేను ముందుగానే కొంత డిజైన్ ని ఊహించి పని మొదలు పెట్టాను, ముందుగా దీపావళికి తగ్గట్టుగా రాత్రి ఎఫెక్ట్ రావడం కోసం నీలం రంగు బేస్ గా తీసుకున్నాను , డిజైన్ లో  ఏమేమి  పెట్టాలి, ఎలా అలంకరించాలి అని నేను ముందు గా అనుకోవడం వల్ల కొన్ని images ని ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్  చేసి ఉంచుకున్నాను. 

కాని ఒక్క మాట .... images డౌన్లోడ్ చేసుకునేటపుడు కాపీరైట్ ఉందొ లేదో చూసి డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం , ఎందుకంటే కొన్ని సార్లు images copyright compliant అయి  ఉంటాయి ... అలాంటి images వాడకపోవడం ఉత్తమం, కొన్ని వెబ్ సైట్స్ ఇమేజ్ లను attribute చేయడం ద్వారా ఉచితం గా వాడుకునే అవకాసం కల్పిస్తాయి , అలాంటి సర్వీసెస్ నుండి images డౌన్లోడ్ చేసుకోవడం అన్నివేళలా ఉత్తమం. 

మీరు  ఈ బ్లాగ్ చేరుకున్నారు అంటే మీరు  ఒక గ్రాఫిక్ డిజైనర్ అయిన అయి ఉండాలి లేక ఫోటోషాప్ ఇంకా బాగా నేర్చుకోవాలి అన్న కుతూహలం ఐన  ఇక్కడికి మిమ్మల్ని తీసుకువచ్చి ఉండాలి ... కింద చెప్పబోయే పాయింట్లు గ్రాఫిక్ డిజైనర్ కి ఐతే త్వరగా అర్ధం అవుతాయి , ఒకవేళ  మీరు ఫోటోషాప్ లెర్నింగ్ స్టేజి లో ఉన్నట్లయితే  నా youtube ఛానల్ తెలుగు ట్యుటోరియల్స్ DTP ద్వార మీ స్కిల్ కి పదును పెట్టుకోగలరు.

ఇక డిజైన్ ప్రాసెస్ లోకి వెళితే
 1. ముందుగా ఫోటోషాప్ లో 8inches  X  3inches కొలతలతో 300pixels/inch తో RGB మోడ్ లో ఒక canvas తీసుకున్నాను, ఆ తరువాత ఒక పక్కన ఇంతకుముందు నేను డౌన్లోడ్ చేసిన దీపం ఇమేజ్ ని పేస్టు చేశాను. ఆ ఇమేజ్ ని erase tool (shortcut - E ) తో కార్నర్లు స్మూత్ గా అయ్యేవరకు కొద్దికొద్దిగా ఎరేస్ చేయాలి , ఇమేజ్ స్మూత్ నెస్ కోసం flow & opacity రెండు కూడా 50 కి సెట్ చేసి స్మూత్ గా ఎరేస్ చేయాలి , మనం తీసుకున్న ఇమేజ్ బ్యాక్ గ్రౌండ్ తో బ్లెండ్ అయ్యే విధంగా మనం లేయర్ పాలెట్ లో ఉన్న బ్లెండ్ మోడ్స్ మారుస్తూ ఉండాలి , ఏదో ఒక బ్లెండ్ మోడ్ లో మీకు అది బ్యాక్ గ్రౌండ్ తో సమానం గా బ్లెండ్ అయినట్లు కనిపిస్తుంది , ప్రతీసారి కూడా ఒకే బ్లెండ్ మోడ్ లో సెట్ అని లేదు, మనo వాడుతున్న బ్యాక్ గ్రౌండ్ రంగు బట్టి బ్లెండ్ మోడ్ ఆధారపడి ఉంటుంది ...  ఈ ట్యుటోరియల్ లో  నేను ఈ ఇమేజ్ ని ఏ విధం గా బ్లెండ్ చేసానో కింద ఉన్న ఇమేజ్ లో మీరు చూడవచ్చు . 













2. ఆ తరువాత స్పార్క్ బబుల్స్ ని డిజైన్ కి add చేశాను. దీనికోసం మీరు google లో bubbles కోసం సెర్చ్ చేస్తే దొరుకుతాయి , bubbles.png అని సెర్చ్ చేస్తే png ఇమేజ్ కూడా మనకి దొరుకుతుంది, ఆ ఇమేజ్ ని ఈ డిజైన్ లోకి తీసుకువచ్చి పైన మార్చినట్లే బ్లెండ్ మోడ్ మార్చి మనకి కావలసిన ఎఫెక్ట్ వచ్చేవిదంగా మార్చుకోవాలి .













3.  ఆ తరువాత ఒక మంచి కాప్షన్ ని ఈ డిజైన్ కి add చేశాను ,  కాప్షన్ మీరు సొంతం గా రాసినది అవ్వవచ్చు లేక ఇంటర్నెట్ లోనుండి గ్రహించినది ఐన అవ్వవచ్చు , రాసిన వారి వివరాలు తెలిస్తే వారిని మీ  బ్లాగ్ లో attribute చేయడం ద్వార వారి కాప్షన్ ఇక్కడ మీరు రైటర్ కి విలువ ఇచ్చిన వారవుతారు , ఇక డిజైన్ విషయానికి వస్తే మీరు ఇక్కడ గమనించవలింది ఏమిటి అంటే running text కి అలాగే మెయిన్ కాప్షన్ కి మనం తేడా చూపించి తీరాలి, ఎందుకంటే మనం ఏం  చెప్పాలి అనుకుంటున్నామో అది రన్నింగ్ టెక్స్ట్ ద్వారా  చెపుతాం అలాగే ఎందుకు చెపుదాం అనుకుంటున్నామో అది మెయిన్ కాప్షన్ ద్వార చెపుతాం అన్నమాట ... ఇక్కడ నేను మెయిన్ కాప్షన్ ని రెండు రంగులతో చూపించాను .














4. ఇక్కడ మెయిన్ కాప్షన్ మీద concentration పెంచడం మనకి అవసరం ఎందుకంటే చూసే వ్యక్తి ఇంకొంచం ఎక్కువసేపు మన డిజైన్ చూడాలి అంటే దానికి ఒక ప్రత్యేఖత కావాలి, అందుకనే నేను టెక్స్ట్ లోపల 45degrees ఆంగిల్ లో లైన్స్ ని ఉంచాను. దీనికోసం నేను ఫోటోషాప్ లో custom shape tool ని ఉపయోగించాను , అందులో ఉన్న ఒక vector shape ని ఇక్కడ వాడడం జరిగింది , ముందుగా  మనం ఏ టెక్స్ట్ లోకి ఆ లైన్స్ ని పంపాలి అనుకుంటున్నామో మనం గీయబోయే custom shapeని ఆ లేయర్ పైన ఉంచాలి , అంటే మెయిన్ టెక్స్ట్ లేయర్ పైన మన ఉంచబోతున్న custom shape ఉండాలి , ఇప్పుడు LAYER MENU లో ఉన్న GROUP WITH PREVIOUS అనే ఆప్షన్ ద్వారా మనం ఆ టెక్స్ట్ లేయర్ లోకి లైన్స్ ని మాస్క్ చేయడం ద్వారా పంపగలం .













5. ఇప్పుడు మెయిన్ కాప్షన్ కింద ఒక ముగ్గు ని ఉంచి ఆ ముగ్గులో దీపాల వరుసని ఉంచాను , కొన్ని సార్లు మనకి మనం సొంతం గా కొన్ని ఇమేజ్ లను తయారు చేసుకోవాలి , అలా తయారుచేసుకున్నదే ఈ ముగ్గు ఇమేజ్ , దాని పైన ఒక వరుసలో దీపాలని ఒకదాని తరవాత ఒకటి అమర్చాలి , దీపం డూప్లికేట్ చేయాలి అంటే CTRL + J ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా మనం దీపం డూప్లికేట్ చేయవచ్చు , ఇలా ముగ్గు మరియు దీపాలు డిజైన్ కి add చేయడం ద్వార మెయిన్ కాప్షన్ మీద concentration ఇంకా పెరుగుతుంది. 













6. ఇప్పుడు మెయిన్ కాప్షన్ ని ఇంకా ఇంకా highlight చేయడం కోసం కాప్షన్ వెనక ఒక చిన్న light ఎఫెక్ట్ ని పెట్టడం జరిగింది, ఆ లైట్ ఎఫెక్ట్ రావడం కోసం elliptical marquee టూల్ తో ఒక CIRCULAR SHAPE సెలక్షన్ గీసి దానికి బ్యాక్  గ్రౌండ్ కన్నా లైట్ కలర్ ఫిల్ చేసి FILTERS > BLUR >GAUSSIAN BLUR ఇవ్వడం ద్వారా మన డిజైన్ లో కనపడే ఎఫెక్ట్ వచ్చే విధంగా మార్చవచ్చు, అలాగే  రెండువైపులా పైసలే (google as PAISLEY )డిజైన్ ని పెట్టడం జరిగింది.అది కూడా మనం మొదటి స్టెప్ లో చేసినట్లు ఎరేజర్ opacity + flow ని 50% కి సెట్ చేసి కొద్దికొద్దిగా ఎరేస్ చేయడం ద్వారా మనకి కావలసిన రిసల్ట్ పొందవచ్చు.













7. మెయిన్ కాప్షన్ కి ఇరువైపులా ఫ్లొరల్ పాటర్న్ ని కూడా కలిపి చివరగా రెండు కాకర పువ్వోత్తులు ఉంచాను,  ఇక్కడ వాడిన ఏ ఆబ్జెక్ట్ కూడా తన visual balance ని కోల్పోకుండా చూడడం అనేది గ్రాఫిక్ డిజైనర్ బాధ్యత ... వీలైనన్ని తక్కువ ఆబ్జెక్ట్ లతో డిజైన్ ని అందం గా చేయొచ్చు అని చెప్పడం నా ఉద్దేశం. 













8. చివర నా లోగో ని ఎడమ వైపు కార్నర్ లో ఉంచడం ద్వారా నా డిజైన్ ని ఇక ముగించాను , అది కూడా మెయిన్ కాప్షన్ కి దూరంగా , అలా  ఎందుకు చేశాను అంటే లోగో కి ఒక స్వతంత్ర అనేది ముఖ్యం .... పండగ గాని, సందర్భం గాని మారుతూ ఉండొచ్చు కాని మన లోగో అనేది మాత్రం ఎప్పటికి మారనిది,  అందుకోసం దానికి ఒక డిజైన్ లో ఒక స్థలం కేటాయించాను... ఇలా చేయడం ద్వార లోగో తనకి తానుగా highlight అవుతుంది అలాగే మిగతా objects ని dominate చేయదు.














చివరగా ఈ  గ్రీటింగ్ ని JPEG ఫార్మాట్ లో SAVE చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్ లలో upload  చేయడమే తరువాయి,
 facebook timeline window అప్డేట్ చేయడానికి మనం ఎడమ వైపు కొంత స్పేస్ వదలాలి అని చెప్పడం జరిగింది , మిగిలిన సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అయితే ఫుల్ కాన్వాస్ అంతా  డిజైన్ తో అలంకరించవచ్చు

చివరగా డిజైన్ ప్రాసెస్ అంతా  ఒక animated GIF(GRAPHIC INTERCHANGE FORMAT ) గా ఇవ్వడం జరిగింది,  




ఈ ట్యుటోరియల్ point by point చదివి, చూసి ఈ ట్యుటోరియల్ పైన మీ విలువైన  ఫీడ్ బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే ఇంకా మరిన్ని ట్యుటోరియల్స్  కోసం రెగ్యులర్ నా బ్లాగ్ ని visit చేస్తూ నా  సోషల్ నెట్వర్కింగ్ సైట్ లను విసిట్ చేయడం ద్వార నాతో రెగ్యులర్ టచ్ లో ఉండండి


మీ వెంకట సాయి కిరణ్
ఫౌండర్ & కంటెంట్ క్రియేటర్
కలర్ ఫుల్ పాలెట్